Home » » గబ్బర్ సింగ్ లాఠీ పక్కన పెడితే పెద్ద రౌడీ

గబ్బర్ సింగ్ లాఠీ పక్కన పెడితే పెద్ద రౌడీ

మే రెండో వారంల విడుదల అవుతున్న పవన్ తాజా చిత్రం ‘గబ్బర్‌సింగ్‌’. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై చాలా అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆడియో విడుదల అయిన దగ్గరనుంచి ఈ చిత్రంపై అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఎంతగానో యూత్ లో కిక్ ఇచ్చిన ‘కెవ్వు కేక’ పాట తెరపై ఎలా ఎక్కిందో అని అంతా ఆసక్తిగా చూస్తున్నారు. ఫ్యాన్స్ మాత్రమే కాక అందరూ ఈ చిత్రంపై పాజిటివ్ గా స్పందించటం జరుగుతోంది. శ్రుతి హాసన్ హీరోయిన్ గా చేసిన ఈ చిత్రాన్ని బండ్ల గణేష్ నిర్మించారు. సంగీతం:దేవిశ్రీ ప్రసాద్‌.

ఈ చిత్రం గురించి దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ…అతను ఖాకీ కడితేనే పోలీసు. నెత్తి మీద టోపీ ఉన్నంతసేపూ సెక్షన్ల గురించి, చట్టాల గురించి పట్టించుకొంటాడు. లాఠీ పక్కనపెడితే అతనికంటే పెద్ద రౌడీ ఉండడు. కేడీగాళ్లను దారిలోకి తీసుకురావాలంటే… ఈ పద్ధతే సరైనదని అతని నమ్మకం. ఇంతకీ కిలాడీ పోలీసు లక్ష్యమేమిటో తెలుసుకోవాలంటే మా సినిమా చూడాల్సిందే అన్నారు‌.

నిర్మాత బండ్ల గణేష్‌ మాట్లాడుతూ ”పవన్‌ శైలికి తగిన కథ ఇది. వినోదాత్మకంగా ఉంటుంది. ‘కెవ్వు కేక’ అనే ప్రత్యేక గీతం మాస్‌ని అలరిస్తుంది. ఈ పాటను మలైకా అరోరాపై ఇటీవలే చిత్రించాము”అన్నారు. యూట్యూబ్‌లో ‘గబ్బర్‌ సింగ్‌’ అంటే వీక్షకుల్లో ఎక్కడ లేని క్రేజ్‌ పెరిగిపోయింది. ఇప్పటి దాకా ‘గబ్బర్‌ సింగ్‌’ ట్రైలర్‌ను లక్షకు పైగా హిట్లు తాకాయి. ముఖ్యంగా ”నాక్కొంచెం తిక్కుంది.. కానీ దానికో లెక్కుంది..” అనే పంచ్‌ డైలాగులు కారణంగా ‘గబ్బర్‌ సింగ్‌’కు హిట్ల తాకిడి ఎక్కువైందని సినిమా యూనిట్‌ వర్గాలు పేర్కొంటున్నాయి.

సల్మాన్‌ ఖాన్‌ హీరోగా బాలీవుడ్‌ హిట్‌ చిత్రం ‘దబంగ్‌’ను తెలుగులో ‘గబ్బర్‌ సింగ్‌’ పేరిట రీమేక్‌ చేస్తున్నారు. సల్మాన్‌ ఖాన్‌ పాత్రను పవన్‌ కళ్యాణ్‌ పోషిస్తుండగా శృతి హాసన్‌, సుహాసిని, అభిమన్యు సింగ్‌ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు. రామ్‌-లక్ష్మణ్‌ నేతృత్వంలో చిత్రీకరించే ఆ ఫైట్ సీన్స్ కు పవన్‌ తనదైన స్టైల్‌ జోడిస్తున్నట్టు సమాచారం.

పరమేశ్వర ఆర్ట్స్ అధినేత బండ్ల గణేశ్ ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రుతిహాసన్, మలైకా అరోరా, అభిమన్యుసింగ్, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, సుహాసిని, తనికెళ్ల భరణి, అజయ్, నాగినీడు, రావు రమేష్, గిరి, ఫిష్ వెంకట్, ప్రభాస్ శ్రీను, ఆలీ, సత్యం రాజేష్, మాస్టర్ ఆకాశ్, మాస్టర్ నాగన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఫొటోగ్రఫీ: జైనన్ విన్సెంట్, సంగీతం: దేవిశ్రీప్రసాద్, ఎడిటింగ్: గౌతంరాజు, సమర్పణ: శివబాబు.
Share this article :
 
Support : Follow us at facebook | Follow us Twitter | Follow us at Youtube
Copyright © 2013. MEGA FAMILY DIE HARD FANZ - All Rights Reserved
Template Created by Santhosh Published by Mega Family Fanz
Proudly powered by Mega Family Fanz